లిటిల్ సోల్జర్స్
(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Enu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());
లిటిల్ సోల్జర్స్
Jump to navigation
Jump to search
లిటిల్ సోల్జర్స్ (1996 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | గుణ్ణం గంగరాజు |
|---|---|
| నిర్మాణం | గుణ్ణం గంగరాజు |
| రచన | గుణ్ణం గంగరాజు |
| కథ | గుణ్ణం గంగరాజు |
| చిత్రానువాదం | గుణ్ణం గంగరాజు |
| తారాగణం | బాలాదిత్య (అప్పటి పేరు మాష్టర్ వై.ఎస్. ఆదిత్య) - సన్నీ, బేబీ కావ్య (బన్నీ), రమేష్ అరవింద్ (అరవింద్), హీరా రాజగోపాల్ (అనిత), కోట శ్రీనివాసరావు (హరిశ్చంద్ర ప్రసాద్), రోహిణీ హట్టంగడి (రాజేశ్వరీ దేవి), గిరిబాబు (శేషగిరిరావు), సుధాకర్ (శేషగిరిరావు కొడుకు), బ్రహ్మానందం (గన్), రాళ్ళపల్లి (గోపాల్), బెనర్జీ (పోలీస్ ఆఫీసర్) |
| సంగీతం | శ్రీ |
| నేపథ్య గానం | దీపిక, శ్రీలేఖ, విష్ణు, శ్రీ, రామ్ చక్రవర్తి, మనో, రవి |
| గీతరచన | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
| సంభాషణలు | గుణ్ణం గంగరాజు |
| ఛాయాగ్రహణం | రసూల్ ఎల్లోర్ |
| కూర్పు | మోహన్ రామారావు |
| నిర్మాణ సంస్థ | ఫాంట్ ఫిల్మ్స్ |
| విడుదల తేదీ | ఫిబ్రవరి 2, 1996 |
| భాష | తెలుగు |
లిటిల్ సోల్జర్స్, 1996లో విడుదలైన ఒక తెలుగు సినిమా. అప్పుడు వస్తున్న మూస చిత్రాలకు భిన్నంగా చిన్నపిల్లలతో ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. క్రైమ్, సస్పెన్స్‌లతో హాస్యాన్ని జోడించడం వలన సినిమా సాఫీగా సాగిపోతుంది.
విషయ సూచిక
1 కథ
2 పాటలు
3 విశేషాలు
4 వనరులు
కథ[మార్చు]
అరవింద్ (రమేష్ అరవింద్), అనిత (హీరా) తల్లిదండ్రుల అనుమతిలేకుండా ప్రేమ వివాహం చేసుకుంటారు. వారికి ఇద్దరు పిల్లలు. సన్నీ (ఇప్పటి బాలాదిత్య అయిన మాస్టర్ ఆదిత్య), బన్నీ (బేబీ కావ్య). అనిత తల్లి రాజరాజేశ్వరి (రోహిణీ హట్టంగడి) గొప్ప ధనవంతురాలు. ఆమె ఆస్తిమీద కన్ను వేసిన అనిత మేనమామ శేషాద్రి (గిరిబాబు), అతని కొడుకు(సుధాకర్) ఒక ప్రమాదంలో అనిత, అరవింద్‌లు చనిపోయేలా చేస్తాడు. అయితే అదృష్టవశాత్తూ సన్నీ, బన్నీ ఆ ప్రమాదంనుండి తప్పించుకొని తాత (తండ్రికి తండ్రి) అయిన హరిశ్చంద్ర ప్రసాద్ (కోట శ్రీనివాసరావు) దగ్గఱకు చేరుతారు. శేషాద్రి వారిని చంపించే ప్రయత్నాలు కొనసాగిస్తాడు. ఆ పిల్లలు అనేక విపత్తులనుండి బయటపడి తాత, అమ్మమ్మల మనసులు మార్చడం సినిమా కథాంశం.
పాటలు[మార్చు]
- అయామ్ ఎ వెరీ గుడ్ గర్ల్, సెడ్ మై టీచర్, మైడియర్ బ్రదర్ - - ఎస్.పి. బాలు, దీపిక (6 యేండ్ల అమ్మాయి), విష్ణు (10 యేండ్ల బాలుడు)
- మా ఫాదర్ ఓ టైగర్! మాట్లాడాలంటే థండర్ - మనో
- అడగాలనుంది ఒక డౌట్‌ని.. సన్‌రైస్ లేని రోజేదని - శ్రీ, దీపిక, విష్ణు, శ్రీలేఖ
- వెండి వెన్నెలా.. దిగిరా ఇలా! - రామ్ చక్రవర్తి, శ్రీలేఖ
- సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకూ? - శ్రీ
- ఎవడండీ వీడు, రాబిన్‌హుడ్‌లా ఉన్నాడే - మనో
- ఏక్ దో తీన్ ఆగే చల్.. యే ప్రమాదం ముంచుకు రానీ, డోంట్ యూ రన్! - రవి
విశేషాలు[మార్చు]
- ఈ సినిమాలో బాలనటుడిగా నటించిన మాస్టర్ ఆదిత్య పెద్దయింతర్వాత హీరోగా మారి చంటిగాడు, కీలుగుర్రం వంటి సినిమాలలో నటించాడు.
- ఈ సినిమాలో బాలాదిత్యకు రెండవ నంది అవార్డు లభించింది. అంతకు ముందు "అన్న" సినిమాలో మొదటి అవార్డు అందుకొన్నాడు.
- ఈ సినిమా తీసే సమయానికి కావ్యకు మూడున్నర యేండ్ల వయసు. కొన్ని షాట్‌లు ఇరవైసార్లు కూడా రీటేక్ చేశారు.
- గుణ్ణం గంగరాజు సహజమైన సంభాషణలు, రసూల్ కెమరా, సిరివెన్నెల పాటలు ఈ చిత్రానికి మంచి బలాన్ని చేకూర్చాయి.
- ఈ సినిమాకు లభించిన అవార్డులు
- ఉత్తమ బాల నటుడు (మాస్టర్ ఆదిత్య)
- ఉత్తమ బాలనటి (బేబీ కావ్య)
- ఉత్తమ క్యారెక్టర్ నటుడు (కోట శ్రీనివాసరావు)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే (గుణ్ణం గంగరాజు)
- ఉత్తమ ఆరంభ దర్శకుడు (గుణ్ణం గంగరాజు)
- ఉత్తమ దర్శకుడు (గుణ్ణం గంగరాజు)
- రెండవ ఉత్తమ చిత్రం
- 19 కేంద్రాలలో విడుదలైన ఈ సినిమా 4 కేంద్రాలలో 100రోజులు ఆడింది.
వనరులు[మార్చు]
తెలుగు సినిమా వెబ్ సైటులో వ్యాసం - రచన: నచకి, అట్లూరి
వర్గాలు:
- 1996 తెలుగు సినిమాలు
- నంది ఉత్తమ చిత్రాలు
- తెలుగు బాలల చిత్రాలు
(window.RLQ=window.RLQ||).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.040","walltime":"0.045","ppvisitednodes":"value":208,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":5473,"limit":2097152,"templateargumentsize":"value":3394,"limit":2097152,"expansiondepth":"value":4,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":0,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 6.768 1 మూస:సినిమా","100.00% 6.768 1 -total"],"cachereport":"origin":"mw1301","timestamp":"20190111194448","ttl":1900800,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0c32u0c3fu0c1fu0c3fu0c32u0c4d u0c38u0c4bu0c32u0c4du0c1cu0c30u0c4du0c38u0c4d","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%B8%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D","sameAs":"http://www.wikidata.org/entity/Q6651990","mainEntity":"http://www.wikidata.org/entity/Q6651990","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2006-08-31T03:35:30Z","dateModified":"2017-03-09T08:00:24Z","image":"https://upload.wikimedia.org/wikipedia/te/5/5c/TeluguFilm_Little_soldiers.jpg","headline":"1996 u0c2cu0c3eu0c32u0c32 u0c1au0c3fu0c24u0c4du0c30u0c02"(window.RLQ=window.RLQ||).push(function()mw.config.set("wgBackendResponseTime":118,"wgHostname":"mw1241"););

